Share News

ఆశాల ఆందోళన

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:00 AM

సిరిపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) గతంలో తమకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆశ వర్కర్లు సోమవారం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

ఆశాల ఆందోళన

సిరిపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి)

గతంలో తమకు ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆశ వర్కర్లు సోమవారం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన జీవోలను ఇంతవరకూ విడుదల చేయలేదన్నారు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాల అంశాలను పట్టించుకోవడం లేదన్నారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, బృంద బీమా ఊసే లేదన్నారు. ఒప్పందం అమలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టామన్నారు. అలాగే కనీస వేతనాలు అమలుచేస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.జగన్‌, యూనియన్‌ గౌరవాధ్యక్షురాలు పి.మణి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.పద్మ, వి.మేరీ, కోశాధికారి వై.సీతారత్నం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:00 AM