కూలిన గ్రీన్‌బెల్ట్ ప్రహరీ గోడ
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:03 AM
జాతీయ రహదారిని ఆనుకుని ముస్లిం తాటిచెట్లపాలెం వద్ద గ్రీన్‌బెల్ట్ రక్షణ కోసం నిర్మించిన ప్రహరీ గోడ బుధవారం కూలిపోయింది.
కొద్దిరోజుల కిందటే నిర్మించిన జీవీఎంసీ
నాణ్యతాలోపం వల్లే కూలిపోయిందని విమర్శలు
విశాఖపట్నం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
జాతీయ రహదారిని ఆనుకుని ముస్లిం తాటిచెట్లపాలెం వద్ద గ్రీన్‌బెల్ట్ రక్షణ కోసం నిర్మించిన ప్రహరీ గోడ బుధవారం కూలిపోయింది. ఎనిమిది అడుగులకుపైగా ఎత్తు కలిగిన గోడ హఠాత్తుగా సగానికి విరిగి పక్కనున్న సర్వీస్ రోడ్డుపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వాహనాలు, మనుషుల రాకపోకలు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. జాతీయ రహదారి వెంబడి గ్రీన్‌బెల్ట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ ఇటీవల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అక్కయ్యపాలెం జంక్షన్ నుంచి ముస్లింతాటిచెట్లపాలెం వరకూ సర్వీసురోడ్డును ఆనుకుని కొన్నిచోట్ల కొత్తగా రక్షణ గోడ నిర్మించింది. అలా ముస్లిం తాటిచెట్లపాలెం వద్ద సుమారు రెండు నెలల క్రితం నిర్మించిన ప్రహరీ గోడ బుధవారం కూలిపోయింది. గోడ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు గోడ నిర్మాణంపై దృష్టిసారించి, అవసరమైతే మొత్తం తొలగించి పునర్నిర్మించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.