Share News

కారిడార్‌ పనులు అడ్డగింత

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:35 PM

మండలంలోని చందనాడ రెవెన్యూ పరిధిలో విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ (వీసీఐసీ) భూములున్న గుల్లబట్టీల వద్ద మంగళవారం అధికార యంత్రాంగం పనులు చేపడుతుండగా రైతులు, దళితులు, టీడీపీ, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు.

కారిడార్‌ పనులు అడ్డగింత
పనులను అడ్డుకున్న రైతులు, టీడీపీ, సీపీఎం నాయకులు

డి.పట్టా, సాగుదారులకు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌

నక్కపల్లి, ఫిబ్రవరి 6: మండలంలోని చందనాడ రెవెన్యూ పరిధిలో విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ (వీసీఐసీ) భూములున్న గుల్లబట్టీల వద్ద మంగళవారం అధికార యంత్రాంగం పనులు చేపడుతుండగా రైతులు, దళితులు, టీడీపీ, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం జిరాయితీ, డి.పట్టా, ప్రభుత్వ, సాగుభూములను ఏపీఐఐసీ సేకరించిందని, కానీ డి.పట్టాదారులకు, సాగులో వున్న వారికి పూర్తి న్యాయం చేయకుండా పనులు ఎలా చేపడతారని టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్‌, సీపీఎం నేత ఎం.అప్పలరాజు ప్రశ్నించారు. భూములిచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తరువాతే పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అధికారులే రైతుల వద్దకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సర్పంచ్‌ పెదపూడి శంకరరావు, ఉప సర్పంచ్‌ గంటా నర్సింగరావు, పెదకాపు, సత్తిబాబు, బాబూజజీ, సిరిపిల్లి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:35 PM