Share News

గిరిజన రైతులతో బంతిపూల సాగు

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:31 AM

గిరిజన రైతులతో బంతిపూల సాగు చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని థింసా ఆర్గానిక్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘం మార్కెటింగ్‌ మేనేజర్‌ వీఎస్‌జే ఆనంద్‌ తెలిపారు.

గిరిజన రైతులతో బంతిపూల సాగు
మాట్లాడుతున్న మార్కెటింగ్‌ మేనేజర్‌ ఆనంద్‌

విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ

థింసా ఆర్గానిక్‌ ఎఫ్‌పీవో మార్కెటింగ్‌ మేనేజర్‌ ఆనంద్‌

చింతపల్లి, సెప్టెంబరు 15: గిరిజన రైతులతో బంతిపూల సాగు చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని థింసా ఆర్గానిక్‌ రైతు ఉత్పత్తిదారుల సంఘం మార్కెటింగ్‌ మేనేజర్‌ వీఎస్‌జే ఆనంద్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో రైతులకు ఎఫ్‌పీవో ద్వారా ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందజేసి పంటకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు తన సొంత పొలంలో బంతి నాట్లు వేసుకోవాలన్నారు. పంట దిగుబడులను ఎఫ్‌పీవో కొనుగోలు చేస్తుందన్నారు. ఔషధ గుణాలు కలిగిన బంతి విత్తనాలను రైతులకు అందజేయడం వల్ల మార్కెటింగ్‌ సమస్య ఉండదన్నారు. ఆసక్తిగల రైతులు విత్తనాలు, ఎరువులు, పూర్తి సమాచారం కోసం 7981637171 ఫోన్‌ నంబర్‌ను సంప్రతించాలని కోరారు.

Updated Date - Sep 16 , 2024 | 12:31 AM