విద్యుదాఘాతంతో గిరిజనుడి మృతి
ABN , Publish Date - Dec 24 , 2024 | 11:24 PM
విద్యుదాఘాతంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బెన్నవరం పంచాయతీ గొచ్చపల్లి గ్రామానికి చెందిన వంతల చిట్టిబాబు మంగళవారం మిరియాల సేకరణకు ఇనుప నిచ్చెనను భుజాన వేసుకుని వెళుతున్నాడు.
చింతపల్లి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బెన్నవరం పంచాయతీ గొచ్చపల్లి గ్రామానికి చెందిన వంతల చిట్టిబాబు మంగళవారం మిరియాల సేకరణకు ఇనుప నిచ్చెనను భుజాన వేసుకుని వెళుతున్నాడు. నిచ్చెన పైభాగం ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై చిట్టిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయకు భార్య లక్ష్మి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవిపడాల్ కోరారు.