Share News

AP News: భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ భార్యపై అమానుషం

ABN , Publish Date - Dec 16 , 2024 | 11:05 AM

Andhrapradesh: జిల్లాలోని చోడవరం మండలం నరసాపురం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పులు తీర్చలేదని దొడ్డి వెంకటరమణ భార్య, పిల్లలు అక్రమ నిర్భంధం చర్చకు దారి తీసింది. గ్రామానికి చెందిన దొడ్డి వెంకటరమణ.. ఇంటి అవసరాల కోసం కొందరు గ్రామస్తుల వద్ద అప్పు చేశాడు.

AP News: భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ భార్యపై అమానుషం
Anakapalli

అనకాపల్లి జిల్లా, డిసెంబర్ 16: కుటుంబ పోషణ కోసం యజమాని ఎంతో కష్టపడుతుండాడు. ఉన్నదాంట్లో సరిపెట్టుకోవాలని భావించినప్పటికీ పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అవసరాలు ఇలా ఎన్నో వచ్చి పడుతుంటాయి. దీంతో వేరే దారి లేక సదరు వ్యక్తి అప్పులు చేస్తుంటాడు. అప్పులు తీసుకునే క్రమంలో ఎలాగైనా తీరుస్తామని నమ్మకంతో తీసుకుంటారు. కానీ ఆ తరువాత ఖర్చులు పెరిగిపోవడంతో ఇంకేదో కారణంతో అప్పులు కట్టలేని పరిస్థితికి చేరుకుంటారు. అప్పులు ఎలా కట్టాలో మార్గం తెలియక, అలాగే మరో చోట అప్పులు ముట్టక ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కొందరు ధైర్యంగా నిలబడి అప్పులు తీరుస్తే.. మరికొందరు అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటారు. అయితే ఇంటి యజమాని చనిపోయిన తరువాత కూడా రుణం ఇచ్చిన వారు కనీసం మానవత్వం మరిచి ప్రవర్తింటారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్..


ఎలాగైన తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఇంటి సభ్యులపై ఒత్తిడి తెస్తుంటారు. డబ్బులు ఇవ్వలేని పక్షంలో మానవత్వం మరిచి ప్రవర్తిస్తుంటారు. ఆ ఇంటి వారిపై దాడికి పాల్పడటం, ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్లడం ఇలా తమకు తోచిన విధంగా ప్రవర్తిస్తుంటారు. అయితే అనకాపల్లికి చెందిన కొందరు వ్యక్తులు మాత్రం తమ అప్పును తిరిగి పొందేందుకు నీచంగా ప్రవర్తించారు. భర్తను కోల్పోయి బాధపడుతున్న వారి పట్ల మరింత అమానుషంగా ప్రవర్తించారు. ఎలాగైనా అప్పు తీర్చాల్చిందే అంటూ చనిపోయిన వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలను గదిలో పెట్టి నిర్బంధించారు. తీసుకున్న రుణం ఇచ్చే దాక వదిలి పెట్టేది లేదని వారు స్పష్టం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

గోల్డ్ రేట్స్ ఇంతలా పడిపోయాయేంటి..


జిల్లాలోని చోడవరం మండలం నరసాపురం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పులు తీర్చలేదని దొడ్డి వెంకటరమణ భార్య, పిల్లలు అక్రమ నిర్భంధం చర్చకు దారి తీసింది. గ్రామానికి చెందిన దొడ్డి వెంకటరమణ.. ఇంటి అవసరాల కోసం కొందరు గ్రామస్తుల వద్ద అప్పు చేశాడు. అయితే వడ్డీ రానురాను పెరిగిపోయింది. అప్పు తీర్చే మార్గం లేకుండాపోయింది. అప్పులు కట్టాలంటూ డబ్బుల ఇచ్చిన వాళ్లు ఒత్తిళ్లకు గురిచేశారు. దీంతో అప్పుల ఒత్తిళ్లు భరించలేక మూడు నెలల క్రిందట రైలు కింద తలపెట్టి దొడ్డి వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని చనిపోయిన బాధలో ఉన్న వారిపై కనీసం కనికరం చూపలేదు ఆ వ్యక్తులు. అప్పులు తీర్చాలని అదే గ్రామానికి చెందిన సురేష్, ఈశ్వరరావు,నాయుడు కలిసి వెంకటరమణ భార్య, పిల్లలను గదిలో బంధించి తాళాలు వేశారు. దీంతో నర్సాపురం బాధిత కుటుంబీకులు ఆవేదన వక్తం చేస్తున్నారు. భర్త చేసిన అప్పులు తీర్చాలని అతని భార్య దొడ్డి శ్యామల, వారి కుమారులు పృద్వి, చందులను గదిలో పెట్టి తాళాలు వేసి నిర్భంధించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి అనిత తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విషయం తెలిసిన చోడవరం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే భర్త అప్పులు తీర్చలేదని ఇలా వారి కుటుంబీకులను నిర్బంధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

బాబోయ్.. ఈ టీ వెరీ కాస్ట్‌లీ

తెలంగాణ అసెంబ్లీ.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 11:09 AM