దట్టంగా పొగమంచు
ABN , Publish Date - Dec 22 , 2024 | 10:49 PM
అల్లూరి జిల్లా కేంద్రం పాడేరును పొగ మంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం పది గంటల వరకు దట్టమైన పొగ మంచు కురవడంతో వాహనదారులకు రహదారి సరిగా కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని నడిపారు.
మన్యాన్ని వణికిస్తున్న ఉష్ణోగ్రతలు
మినుములూరులో 12..
పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత
పాడేరురూరల్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా కేంద్రం పాడేరును పొగ మంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం పది గంటల వరకు దట్టమైన పొగ మంచు కురవడంతో వాహనదారులకు రహదారి సరిగా కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని నడిపారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు 20, 30 కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడపాల్సి వచ్చింది. మంచు తీవ్రత, చలి ప్రభావంతో బయటకు వెళ్లలేక ఉదయం 10 గంటల వరకు వృద్ధులు, చిన్నారులు ఇంటికే పరిమితమయ్యారు. పాడేరులో 14, మినుములూరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.