Share News

నగరానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రాక

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:19 AM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు.

నగరానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రాక

విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాడిసన్‌ హోటల్‌కు వెళ్లి బస చేశారు. శుక్రవారం పవన్‌ కల్యాణ్‌ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వెళతారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో పర్యటిస్తారు.

పర్యాటక శాఖా మంత్రి దుర్గేశ్‌ రాక

విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేశ్‌ గురువారం రాత్రి నగరానికి వచ్చారు. ప్రభుత్వ అతిథిగృహంలో బస చేశారు. ద్వారకా నగర్‌ పౌరగ్రంథాయలంలో శుక్రవారం జరగనున్న పరవస్తు చిన్నయసూరి జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తరువాత మధ్యాహ్నం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి వెళతారు.

Updated Date - Dec 20 , 2024 | 01:19 AM