Share News

విద్యా వ్యవస్థను ప్రయోగశాల చేయొద్దు

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:19 AM

రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రయోగశాలగా మారుస్తున్నదని, ఇటవంటి చర్యలను విరమించుకోవాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి గొంది చినబ్బాయి పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా స్వర్ణోత్సవ సభ ఆదివారం ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది.

విద్యా వ్యవస్థను ప్రయోగశాల చేయొద్దు

యూటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి చినబ్బాయి

అనకాపల్లి టౌన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రయోగశాలగా మారుస్తున్నదని, ఇటవంటి చర్యలను విరమించుకోవాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి గొంది చినబ్బాయి పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా స్వర్ణోత్సవ సభ ఆదివారం ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చినబ్బాయి మాట్లాడుతూ, సిలబస్‌ను ఇష్టం వచ్చినట్టుగా మారుస్తూ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. 117 జీవో వల్ల ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 117 జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. జీవో నంబరు-3ని సర్వోన్నత న్యాయస్థానంం రద్దు చేయడం వల్ల మైదాన ప్రాంత ఉపాధ్యాయులు ఏజెన్సీకి బదిలీపై వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అన్నా రాము, సమాఖ్య నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:19 AM