సిలబస్ పేరుతో చుక్కలు
ABN , Publish Date - Feb 12 , 2024 | 01:14 AM
టెట్, డీఎస్సీ ఆశావహ అభ్యర్థులను సిలబస్ ఆందోళనకు గురిచేస్తోంది.
టెట్, డీఎస్సీ అభ్యర్థులకు ముప్పు తిప్పలు
గతంలో లేని విధంగా అధికారుల నిర్ణయం
ఆందోళనలో ఆశావహ అభ్యర్థులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):
టెట్, డీఎస్సీ ఆశావహ అభ్యర్థులను సిలబస్ ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సిలబస్ ఇచ్చా రని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ కోసం పోరాటం చేసిన నిరుద్యోగులపై కక్ష సాధింపులో భాగంగానే సిలబస్‌ను అధికంగా ఉండేలా చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా టెట్, డీఎస్సీ అర్హత పరీక్షలో కంటెంట్, మెథడాలజీ సిలబస్‌గా ఉంటాయి. టెట్ రాసే అభ్యర్థులు మూడు నుంచి పది (డీఎడ్ అభ్యర్థులు), ఆరు నుంచి ఇంట ర్ వరకు (బీఈడీ అభ్యర్థులు) సిలబస్‌ను రిఫర్ చేస్తారు. ఇవి
ఎప్పుడు నిర్వహించినా అంతకుముందు అకడమిక్ ఇయర్‌లో అమలుచేసిన సిలబస్ ఇవ్వాలి. దీనిప్రకారం తాజాగా నిర్వహించనున్న టెట్, డీఎస్సీలో 2022-23 విద్యా సంవత్సరంలో అమలుచేసిన సిలబస్ ఇవ్వాలి. కానీ ఇక్కడే విద్యాశాఖ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా రంగంలో సంస్కరణల పేరుతో 2019 నుంచి 2023 వరకు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సిలబస్‌ను మార్చేసింది. 2023-24లో కూడా ఆరు, ఏడు, ఎనిమిది తరగ తుల సిలబస్‌ను మార్చింది. 2018లో అప్పటి ప్రభుత్వం కొన్ని తరగతుల సిలబస్ మార్చింది. ఇప్పటి వరకు మార్చిన మొత్తం సిలబస్‌లోనే టెట్, డీఎస్సీలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. అయితే కేవలం తొమ్మిదోతరగతి సిలబస్‌ను రిఫర్ చేయ డానికే కనీసం రెండు నెలలు పడుతుంది. అలాంటిది ఇన్నేళ్ల పాటు మార్చిన సిలబస్‌ను నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేయడం సాధ్యం కాదని అభ్యర్థులు వాపోతున్నారు.
14 మెథడ్స్ చదవాలిందే...
ఎస్జీటీ అభ్యర్థులకు 2018 వరకు ఐదు మెథడ్స్ ఉండేవి. ఆ తరువాత ప్రభుత్వం దీనిని తొమ్మిదిగా మార్పు చేసింది. తాజాగా టెట్, డీఎస్సీలో వీటితో పాటు పాత ఐదు మెథడ్స్ ను సిలబస్‌లో ఇస్తున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. ఒక్కో మెథడాలజీ పుస్తకం 300 పేజీలుంటుంది. తొమ్మిది మెథడా లజీలు తిరగేసేందుకు రెండు నెలలు పడుతుందని అభ్య ర్థులు పేర్కొంటున్నారు. వీటితోపాటు డీఎస్సీలో పర్‌స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇందులో నుంచి 20 వరకు బిట్స్ ఇస్తారు. పర్‌స్పెక్టివ్ ఎడ్యుకేషన్‌తోపాటు మిగిలిన సబ్జెక్టులను రిఫర్ చేసేలా తాజాగా డీఎస్సీలో సిలబస్ పెట్టారని, ఇది మరింత ఇబ్బందికరమైన అంశమంటున్నారు. దీనివల్ల మెథడాలజీతోపాటు మిగిలిన సబ్జెక్టులను చదవాలంటున్నారు.
ఏదీ సమయం..?
టెట్ నోటిఫికేషన్‌కు, పరీక్షకు కనీసం మూడు నెలలు, టెట్‌కు, డీఎస్సీకి మధ్య రెండు నెలలు సమయం ఇస్తుం టారు. కానీ తాజాగా టెట్, డీఎస్సీ పరీక్షలకు మధ్య ఉన్న సమయం వారం రోజులు కంటే తక్కువ. సాధారణంగా టెట్ క్వాలిఫై అయిన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేస్తారు. కానీ హడావిడి నోటిఫికేషన్‌తో కనీసం పుస్తకాలు తిరగేసేందుకు కూడా అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. ఈ నెల నుంచి 27 నుంచి మార్చి తొమ్మిది వరకు టెట్ జరగనుంది. మార్చి 14న ఫలితాలు ప్రకటిస్తారు. మార్చి 17 నుంచి 30 వరకు డీఎస్సీ నిర్వహి స్తారు. కాగా టెట్‌కు గతంలో రూ.250 నుంచి రూ.500 వరకు ఫీజు వసూలు చేయగా, తాజాగా దానిని రూ.750కు పెంచారని, డీఎస్సీ ఫీజు గతం లో రూ.వెయ్యి ఉండగా, ఇప్పుడు రూ.1200 చేశారని వాపోతున్నారు.