Share News

ఏక్‌ నిరంజన్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:00 AM

గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల విలీనంతో మండలంలోని గుడ్డిప కొత్తూరు, తట్టబంద పంచాయతీ శివారు ఎల్‌ఎన్‌ పురం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏక్‌ నిరంజన్‌
గుడ్డిప కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్ధికే పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయిని

మండలంలోని గుడ్డిప కొత్తూరు, ఎల్‌ఎన్‌ పురం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి మాత్రమే..

పది మందిలోపు స్కూళ్లు మరికొన్ని..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల విలీనంతో ఇబ్బందులు

రావికమతం, జూలై 4: గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల విలీనంతో మండలంలోని గుడ్డిప కొత్తూరు, తట్టబంద పంచాయతీ శివారు ఎల్‌ఎన్‌ పురం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం కావడం, కొందరు ప్రైవేటు పాఠశాలల్లో చేరడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మండలంలో 51 ప్రాథమిక పాఠశాలలు, 9 యూపీ స్కూళ్లు, 9 జడ్పీ హైస్కూళ్లు, ఒక కేజీబీవీ, ఒక ఏపీ మోడల్‌ స్కూల్‌ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఏటా సుమారు ఐదు వేలు నుంచి ఆరు వేల మంది వరకు చదువుతుంటారు. అయితే రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్‌ 117తో ప్రాథమిక పాఠశాలలను సమీప పాఠశాలల్లో కొన్నింటిని విలీనం చేశారు. దీంతో మండలంలో గుడ్డిప కొత్తూరు, తట్టబంద పంచాయతీ శివారు ఎల్‌ఎన్‌ పురం ప్రాథమిక పాఠశాలలో ఒక్కటి, రెండు తరగతులకు గాను గత రెండేళ్లుగా ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కాలనీ పాఠశాలలో ముగ్గురు, మత్స్య వానిపాలెం, కన్నంపేట, శ్రీరామనగర్‌ కాలనీ పాఠశాలల్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. గర్నికం పంచాయతీ శివారు కానాడ ప్రాథమిక పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు. విలీనం ప్రక్రియతో మండలంలో 20 మంది విద్యార్థులు లోపు ఉన్న పాఠ శాలలు మరికొన్ని ఉన్నాయి. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతూనే ఉంది. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 01:00 AM