ముగిసిన ఈఎంఆర్‌ఎస్ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్
ABN , Publish Date - Nov 22 , 2024 | 10:49 PM
స్థానిక గురుకుల క్రీడా మైదానంలో 4వ ఈఎంఆర్‌ఎస్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్-2024 శుక్రవారంతో ముగిసింది.
22 ఈవెంట్స్‌లో ప్రతిభ కనబరచిన ఏకలవ్య బాల, బాలికలు
అరకులోయ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక గురుకుల క్రీడా మైదానంలో 4వ ఈఎంఆర్‌ఎస్ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్-2024 శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర గురుకుల సొసైటీ ఓఎస్‌డీ ఎ.రఘునాథ్ మాట్లాడుతూ.. ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. గెలుపు ఓటములు ప్రధానం కాదని, తాము ఎంతవరకు రాణించామన్నది ముఖ్యమన్నారు. ఈసారి రన్నర్స్ వచ్చే ఏడాది నిర్వహించే పోటీల్లో విన్నర్స్ కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 22 ఈవెంట్స్‌లో అత్యంత ప్రతిభను కనబరచి విజేతలను ఆయన అభినందించారు. అనంతరం 22 ఈవెంట్స్‌లో విజేతలైన బాల బాలికలకు పతకాలతో పాటు మెమోంటోలను గురుకుల ఓఎస్‌డీ రఘునాథ్, అసిస్టెంట్ సెక్రటరీలు హరి, ఎస్‌టీపీ.రాఘవాచార్యులు, అరకులోయ క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ పీఎస్‌ఎన్.మూర్తి అందజేశారు. స్పోర్ట్స్ మీట్‌లో అన్ని విధాల సహకరించిన అరకులోయ క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ పీఎస్‌ఎన్.మూర్తిని ఓఎస్‌డీ రఘునాథ్, అసిస్టెంట్స్ సెక్రటరీలు హరి, రాఘవాచార్యులు సత్కరించారు. అదేవిధంగా పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏకలవ్య మోడల్ రెసిడిన్షియల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లును అభినందించారు.