పాఠశాలల పనివేళలు పెంపు
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:47 AM
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పని వేళలు మారనున్నాయి.ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు నిర్వహిస్తుండగా, ఇకపై సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు నడుస్తాయి. పని వేళలను ఒక గంట పొడిగిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఉత్తర్వులు జారీచేశారు. అయితే అన్ని పాఠశాలల్లో ఒకేసారి కాకుండా.. మండలానికి ఒక పాఠశాల చొప్పున పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, గొలుగొండ, పరవాడ, సబ్బవరం మండలాల్లో రెండేసి పాఠశాలలను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 30 పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీ నుంచి పది రోజులు పాటు పని వేళలు పొడిగించి నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.
హైస్కూళ్లలో రోజూ గంటపాటు అదనంగా బోధన
ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు
పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 30 పాఠశాలలు ఎంపిక
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యా శాఖ
నర్సీపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పని వేళలు మారనున్నాయి.ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు నిర్వహిస్తుండగా, ఇకపై సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాలలు నడుస్తాయి. పని వేళలను ఒక గంట పొడిగిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఉత్తర్వులు జారీచేశారు. అయితే అన్ని పాఠశాలల్లో ఒకేసారి కాకుండా.. మండలానికి ఒక పాఠశాల చొప్పున పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, గొలుగొండ, పరవాడ, సబ్బవరం మండలాల్లో రెండేసి పాఠశాలలను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 30 పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీ నుంచి పది రోజులు పాటు పని వేళలు పొడిగించి నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన పాఠశాలలు
నర్సీపట్నం మండలంలో గబ్బాడ హైస్కూల్, నర్సీపట్నం టౌన్‌లో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, అనకాపల్లిలో బాలికోన్నత పాఠశాల, అనకాపల్లి మండలంలో కూండ్రం హైస్కూల్, గొలుగొండ మండలంలో ఏఎల్‌పురం చీడిగుమ్మల, చోడవరం మండలంలో లక్ష్మీపురం, చోడవరం బాలికోన్నత పాఠశాలలు, పరవాడ మండలంలో పరవాడ, లంకెలపాలెం హైస్కూళ్లు, సబ్బవరం మండలంలో సబ్బవరం, నంగినారపాడు ఉన్నత పాఠశాలలు, అచ్యుతాపురం మండల కేంద్రంలో హైస్కూల్, బుచ్చెయ్యపేట మండలంలో దిబ్బిడి, దేవరాపలి,్ల చీడికాడ, కె.కోటపాడు, కోటవురట్ల మండలంలో జల్లూరు, కశింకోట, మునగపాక, రావికమతం, ఎస్.రాయవరం, వి.మాడుగుల, రోలుగుంట, నాతవరం, మాకవరపాలెం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట బాలికోన్నత పాఠశాల, ఎలమంచిలి మండలం కొత్తపేట ఉన్నత పాఠశాల.
పనివేళలు..
ఉదయం 9 గంటలకు ఫస్ట్ బెల్, 9.05 కి సెకెండ్ బెల్, 9.05 నుంచి 9.25 వరకు అసెంబ్లీ నిర్వహించాలి. ఫస్ట్ పీరియడ్ 9.25 నుంచి 10.15 గంటలు, సెకెండ్ పీరియడ్ 10.15 నుంచి 11 గంటలు, 11 గంటలు నుంచి 11.15 వరకు విరామం. మూడో పీరియడ్ 11.15 నుంచి 12 గంటలు, నాలుగో పీరియడ్ 12 నుంచి 12.45 గంటలు. 12.45 నుంచి 1.45 వరకు మధ్యాహ్న భోజనం విరామం. 1.45 నుంచి 2.30 గంటల వరకు ఐదో పీరియడ్, 2.30 నుంచి 3.15 గంటల వరకు ఆరో పీరియడ్ నిర్వహించాలి. తర్వాత విద్యార్థులకు పావుగంట విరామం ఇవ్వాలి. ఏడో పీరియడ్ 3.30 నుంచి 4.15 గంటల వరకు, ఎనిమిదో పీరియడ్ 4.15 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. నెలాఖరు వరకు ఈ విధానాన్ని అమలు చేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకొని జిల్లా విద్యా శాఖ అధికారికి పంపించాలని ఆదేశాలు ఇచ్చారు.
బాలికలకు ఇబ్బందే
నర్సీపట్నం మండలం గబ్బాడ స్కూల్‌లో పనివేశలు పొడిగిస్తూ డీఈవో ఉత్తర్వులు ఇచ్చారని, సాయంత్రం 5 గంటలు వరకు తరగతులు నిర్వహించడం వల్ల బాలికలు ఇబ్బంది పడతారని పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు అడిగర్ల వరహాలనాయుడు, జీవీ రమేశ్ తెలిపారు. ఐదారు కిలో మీటర్ల దూరం నుంచి సైకిళ్లు మీద వచే బాలికల గురించి అధికారులు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు.