తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:25 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
జి.మాడుగులలో 9.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
పాడేరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు.
జి.మాడుగులలో 9.3 డిగ్రీలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా దిగజారుతున్నాయి. ఆదివారం జి.మాడుగులలో 9.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అరకులోయలో 9.4, చింతపల్లిలో 9.9, జీకేవీధిలో 10.4, డుంబ్రిగుడలో 10.5, పాడేరులో 11.0, పెదబయలులో 12.1, అనంతగిరిలో 13.0, ముంచంగిపుట్టులో 13.1, కొయ్యూరులో 14.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి మొదలైంది. చలి నుంచి ఉపశమనం పొందేందుకు గిరిజనులు చలి మంటలు వేసుకున్న దృశ్యాలు కనిపించాయి.