Share News

సాగునీటి కోసం రైతుల పాట్లు

ABN , Publish Date - Nov 21 , 2024 | 11:53 PM

మండలంలోని పలు గ్రామాల్లో వరి రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.

సాగునీటి కోసం రైతుల పాట్లు
దెబ్బతిన్న గ్రోయిన్‌ వద్ద తాత్కాలిక పనులు చేస్తున్న రైతులు

దెబ్బతిన్న గ్రోయిన్‌ వద్ద శ్రమదానం

ఎస్‌.రాయవరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో వరి రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. ధర్మవరం అగ్రహారం వద్ద వరహానదిలో ఉన్న గ్రోయిన్‌ దెబ్బతినడంతో పలు గ్రామాల్లో పొలాలకు నీరందించే ఎస్‌.రాయవరం పంట కాలువ వైపు సాగునీరు ప్రవహించడం లేదు. దీంతోటీడీపీ నేత కరణం శివ ఆధ్వర్యంలో పేటసూదిపురం, ఎస్‌.రాయవరం రైతులు గ్రోయిన్‌ వద్ద కర్రలు, తాటి దుక్కలను అడ్డుగా వేసి, ఇసుక బస్తాలను పేర్చి.. నీటిని పంట కాలువ వైపు మళ్లించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న పాట్లును చూసిన పలువురు రైతులకు సాగునీటి కష్టాలు ఎప్పటికీ తీరునో అంటూ నిట్టూర్చారు.

Updated Date - Nov 21 , 2024 | 11:53 PM