గంగవరం పోర్టు కార్మికుల ఆందోళన
ABN , Publish Date - Apr 12 , 2024 | 01:12 AM
అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు కార్మికులు గురువారం ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాట పట్టారు.
రాత్రయినా కొనసాగుతున్న నిరసన
పెదగంట్యాడ, ఏప్రిల్ 11: అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు కార్మికులు గురువారం ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాట పట్టారు. తక్షణమే వేతనాలు పెంచాలని, కనీస వేతనంగా రూ.36 వేలు చెల్లించాలని, ఏటా మూల వేతనంపై 20 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, క్యాంటీన్‌లో సబ్సిడీ కల్పించాలని కార్మికులు నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇతర అలవెన్సులను కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాత్రయినా కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. కాగా కార్మికులు ఆందోళన చేస్తున్నా నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.