Share News

విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన జీవో 117ను రద్దు చేయాలి

ABN , Publish Date - Jun 18 , 2024 | 12:44 AM

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన జీవో 117ను కొత్త ప్రభుత్వం విధిగా రద్దు చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారు.

విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన జీవో 117ను రద్దు చేయాలి
మాట్లాడుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ

పాడేరు, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన జీవో 117ను కొత్త ప్రభుత్వం విధిగా రద్దు చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కోరారు. స్థానిక ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రావుల జగన్మోహన్‌రావు అధ్యక్షతన సోమవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజాభివృద్ధికి ఎంతో కీలకమైన విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన జీవో 117ను రద్దు చేయాలన్నారు. ఈ జీవో వల్ల పాఠశాలలు విలీనం, పేదలకు విద్య దూరం కావడంతో పాటు ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌ను బదిలీ చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కేజీవీబీల్లో ఉపాధ్యాయులను, ఇతర కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను పర్మినెంట్‌ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్‌ నేతలు బి.వెంకటపతిరాజు, కొర్రా ధనుర్జయ్‌, ఎ.శ్యామ్‌సుందర్‌ బట్టి చిన్నారావు, సన్యాసిరావు, రామారావు, పొతురాజు, ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 12:44 AM