Share News

సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:21 PM

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.

సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

హౌసింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులపై సమీక్ష

అనకాపల్లి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. గత వారం రోజుల్లో జరిగిన ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని, జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, నీటి సరఫరా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా అధికారి రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:21 PM