రైతులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:14 AM
రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, నాణ్యమైన పంటలు పండించి, అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు.
కలెక్టర్ విజయకృష్ణన్
సబ్బవరం, అక్టోబరు 1: రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, నాణ్యమైన పంటలు పండించి, అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. మండలంలో వ్యవసాయ సిబ్బంది చేపట్టిన ఇ-క్రాప్ నమోదును మంగళవారం తవ్వవానిపాలెంలో ఆమె పరిశీలించారు. పంటలు సాగు చేసే రైతులంతా విధిగా ఇ-క్రాప్ చేయించుకోవాలని సూచించారు. రైతు సేవా కేందాల్లో ఎరువులు, విత్తనాల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. కూరగాయ పంటలను సాగు చేసే రైతులతో మాట్లాడి, వారి సమస్యలను ఆలకించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యసాయాధికారి బి.మోహనరావు, అనకాపల్లి ఏడీ ఎం.రామారావు, ఏవో పోతల సత్యనారాయణ, ఏఈవో బాలరాజు, సర్పంచ్ బోకం స్వామినాయుడు, డిప్యూటీ తహసీల్దార్ అప్పారావు, ఆర్‌ఐ వీరయ్య వున్నారు.