పలు చోట్ల భారీ వర్షం
ABN , Publish Date - May 13 , 2024 | 01:13 AM
జిల్లాలో ఆదివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురిసింది. జీకేవీధి మండలం సీలేరు, దారకొండ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపడంతో జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని భారీ వర్షం కురిసింది. సీలేరు, ధారకొండ, దుప్పులవాడ ప్రాంతాల్లో రెండు గంటలకు పైగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
సీలేరు, మే 12 : జిల్లాలో ఆదివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురిసింది. జీకేవీధి మండలం సీలేరు, దారకొండ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపడంతో జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని భారీ వర్షం కురిసింది. సీలేరు, ధారకొండ, దుప్పులవాడ ప్రాంతాల్లో రెండు గంటలకు పైగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
హుకుంపేటలో..
హుకుంపేట: మండలంలో ఆదివారం ఉదయం నుంచి ఎండ కాసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. వర్షం వల్ల వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు.