Share News

అచ్యుతాపురం జంక్షన్‌లో హైమాస్ట్‌ వెలుగులు

ABN , Publish Date - Nov 21 , 2024 | 11:49 PM

అచ్యుతాపురం జంక్షన్‌ రాత్రి పూట విద్యుత్‌ వెలుగులతో కళకళలాడుతోంది.

అచ్యుతాపురం జంక్షన్‌లో హైమాస్ట్‌ వెలుగులు
అచ్యుతాపురం జంక్షన్‌లో రంగులతో విరాజిల్లుతున్న హైమాస్ట్‌ లైట్లు

అచ్యుతాపురం, నవంబరు 21 (ఆన్‌లైన్‌): అచ్యుతాపురం జంక్షన్‌ రాత్రి పూట విద్యుత్‌ వెలుగులతో కళకళలాడుతోంది. జంక్షన్‌లో కనీసం వీధి లైట్లు కూడా ఉండేవి కావు. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గతంలో ఏపీఐఐసీ పూడిమడక రోడ్డు, అనకాపల్లి రోడ్డులో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటుచేశారు. కాని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు ఎప్పుడూ వెలగలేదు. అఽధికారులు, ప్రజాప్రతినిధులు, ఏపీఐఐసీ పట్టించుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఐఐసీ జంక్షన్‌లో హైమాస్ట్‌ లైట్లు వేయడంతో వెలుగులు సంతరించుకున్నాయి.

Updated Date - Nov 21 , 2024 | 11:49 PM