Share News

బురద రోడ్డులో ప్రయాణమెలా?

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:23 PM

మండలంలోని బూదరాళ్ల పంచాయతీ బాలరేవుల- లోయలపాలెం ప్రధాన రహదారి బురదమయంగా మారింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు రహదారి అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. దీంతో 15 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

బురద రోడ్డులో ప్రయాణమెలా?
బాలరేవుల- లోయలపాలెం రహదారి బురద మయంగా మారిన దృశ్యం

15 గ్రామాల ప్రజలకు తప్పని రవాణా కష్టాలు

కొయ్యూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని బూదరాళ్ల పంచాయతీ బాలరేవుల- లోయలపాలెం ప్రధాన రహదారి బురదమయంగా మారింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు రహదారి అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. దీంతో 15 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

మండలంలోని బాలరేవుల- లోయలపాలెం ప్రధాన రహదారి గుండా నూకరాయితోట, పోకలపాలెం, గోధుమలంక, చీడిపల్లితో పాటు మరో 11 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్‌ కనెక్ట్‌ పాడేరు పథకం కింద ఈ రోడ్డును నిర్మించారు. అయితే గ్రావెల్‌ రోడ్డు నిర్మించి వదిలేయడంతో తాజాగా కురుస్తున్న వర్షాలకు బురదమయమైంది. ముఖ్యంగా లోయలపాలెం వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో 15 గ్రామాల ప్రజలు రవాణా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధి కారులు స్పందించి దీనిని మెటల్‌ రోడ్డుగా మార్చి రవాణా ఇబ్బందులను తొలగించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:23 PM