Share News

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:05 AM

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం వారు మధురవాడ మార్కట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం

మధురవాడ, జూలై 26 : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం వారు మధురవాడ మార్కట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు డి. అప్పలరాజు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి వివిధ ఆర్థిక సంస్థలు, ప్రపంచ బ్యాంకు ద్వారా రూ. 15 వేల కోట్లు ఇస్తామని ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారని, అలాంటపుడు కేంద్రం ఏమిచ్చినట్టు అని ప్రశ్నించారు. విశాఖకు రైల్వే జోన్‌తో పాటు మెట్రో ప్రాజెక్టుపై కూడా బీజేపీ నోరుమెదపలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. రాజుకుమార్‌, గోవిందా, రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఆరిలోవ : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ ఆరిలోవలోని టీఐసీ పాయింట్‌ వద్ద సీపీఎం నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కుమార్‌ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఒక్క ప్రాజెక్టుపై కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమలో పార్టీ నాయ కులు నరేంద్రకుమార్‌, ఎస్‌. రంగమ్మ, పి. శంకర్రావు, కె. సత్యన్నారాయణ, వి. కాంత, తులసీరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:05 AM