Share News

కనకమ్మకు నీరాజనం

ABN , Publish Date - Dec 06 , 2024 | 01:32 AM

కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా తొలి గురువారం పూజలకు భక్తులు పోటెత్తారు.

కనకమ్మకు నీరాజనం

తొలి గురువారం పూజలకు పోటెత్తిన భక్తులు

కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా తొలి గురువారం పూజలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో బారులుతీరి నిల్చొని అమ్మను దర్శించుకున్నారు. ఉమ్మడి జిల్లా వాసులతో పాటు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల నుంచి వెల్లువలా తరలిరావడంతో బురుజుపేట వీధులు కిక్కిరిశాయి. అభిషేకాల అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

Updated Date - Dec 06 , 2024 | 01:32 AM