పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:22 AM
గ్రామాల్లో ప్రజలు తమ ఆరోగ్యంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఎన్. మల్వేశ్వరి అన్నారు.
ఎస్.రాయవరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలు తమ ఆరోగ్యంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ఎన్. మల్వేశ్వరి అన్నారు. మండలంలోని ధర్మవరం అగ్రహారం గ్రామాన్ని సోమవారం రాష్ట్ర ఐడీఎస్‌పీ బృందం సందర్శించింది. ఇటీవల గ్రామానికి చెందిన అడపా లోవ కుటుంబ సభ్యులు ఐదుగురు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నది వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరక్టర్ ఎన్ మల్లేశ్వరితోపాటు ఐడీఎస్‌పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ హెచ్. వెంకటేశ్వర్లు ఆరా తీశారు. ఆరోజు తిన్న ఉప్మా కలుషితం కావడానికి గల కారణాలను అడపా లోవను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్ డి. వినోద్‌కుమార్, పెనుగొల్లు పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ రాజేశ్వరి, జిల్లా ఎపిడెమిక్ సెల్ ఎంపీహెచ్‌ఈవో సన్యాసిరావు, మాజీ ఉప సర్పంచ్ సియ్యాదుల అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.