Share News

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విద్యార్థి సంఘాల నేతలు దీక్ష

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:10 AM

స్థానిక నెహ్రూచౌక్‌లో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విద్యార్థి సంఘాల నేతలు దీక్ష
దీక్షలో కూర్చున్న వారికి సంఘీభావం తెలుపుతున్న కొణతాల రామకృష్ణ

అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 1 : స్థానిక నెహ్రూచౌక్‌లో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. శిబిరాన్ని ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఆర్‌.దొరబాబు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ప్రారంభించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌.శివాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రితో మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎ్‌స్‌ఓ, డీవైఎఫ్‌ఐ నాయకులు ఎం.రమణ, ఫణింద్ర, భాస్కర్‌, నాని, వి.రాజు, గీతా కృష్ణ, శ్రీను, అప్పలరాజు పాల్గొన్నారు. దీక్షకు ఐద్వా జిల్లా కార్యదర్శి డీడీ. వరలక్ష్మి సంఘీభావం తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 12:10 AM