Share News

బలిఘట్టం సత్యనారాయణస్వామి ఆలయానికి మహర్దశ

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:34 AM

బలిఘట్టం ఉత్తర వాహిని సమీపంలోని సత్యనారాయణస్వామి ఆలయాన్ని అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం దత్తత తీసుకున్నట్టు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు క్యాంప్‌ ఆఫీసు నుంచి అధికారంగా తెలిసింది. దీనికి సంబంధించిన దేవదాయ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది. వివరాల్లోకి వెళితే.

బలిఘట్టం సత్యనారాయణస్వామి ఆలయానికి మహర్దశ
బలిఘట్టంలో సత్యనారాయణస్వామి ఆలయం

అన్నవరం దేవస్థానం దత్తత

ఫలించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కృషి

నర్సీపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): బలిఘట్టం ఉత్తర వాహిని సమీపంలోని సత్యనారాయణస్వామి ఆలయాన్ని అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం దత్తత తీసుకున్నట్టు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు క్యాంప్‌ ఆఫీసు నుంచి అధికారంగా తెలిసింది. దీనికి సంబంధించిన దేవదాయ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది. వివరాల్లోకి వెళితే.

పూర్వం కాలంలో సత్యనారాయణస్వామి ఆలయం వరహా నది అవతల వైపు ఉండేది. కాల క్రమేణా ఆలయం జీర్ణావస్థకు చేరుకోవడంతో 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.45 లక్షలతో సత్యనారాయణస్వామి ఆలయాన్ని పునర్నిర్మించింది. నాడు మంత్రిగా వున్న అయ్యన్నపాత్రుడు సుమారు రూ.75 లక్షలతో ఆలయాన్ని ఆనుకొని కల్యాణ మండపం నిర్మించడానికి కృషి చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోక పోవడంతో నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండి పోయాయి. ఆలయానికి బలిఘట్టం, గుండుపాలలో సుమారు 30 ఎకరాల భూములు వున్నాయి. కౌలు ద్వారా ఏటా రూ.50 వేల ఆదాయం మాత్రమే వస్తున్నది.. హుండీ ఆదాయం మరో రూ.30 వేలు వుంటుంది. ప్రధాన అర్చకులు, ఒక స్వీపరు పని చేస్తున్నారు. ఆలయానికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో ధార్మిక కార్యక్రమాలు నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారు. ఽ

ఫలించిన దత్తత ప్రక్రియ

బలిఘట్టం సత్యనారాయణస్వామి ఆలయాన్ని అన్నవరం దేవస్థానం దత్తత తీసుకుంటే అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దేవదాయ శాఖ కమిషనర్‌ దృష్టికి తీసకువెళ్లారు. బలిఘట్టం ఆలయం స్థితిగతులు, ఆదాయ వివరాలను దేవదాయ శాఖ ఉన్నతాధికారులు కోరడంతో స్థానిక కార్యనిర్వహణాధికారి ఇరవై రోజుల క్రితం పంపించారు. అన్నవరం దేవస్థానం దత్తత ప్రక్రియ పూర్తి అయినట్టు స్పీకర్‌ క్యాంప్‌ ఆఫీసు నుంచి అధికారికంగా స్థానిక మీడియాకు తెలియజేశారు.

Updated Date - Nov 16 , 2024 | 12:34 AM