వాల్తేరు డీఆర్‌ఎంగా ఎండీఆర్‌ఎం మనోజ్ సాహూ
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:59 AM
వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోవడంతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి):
వాల్తేరు రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోవడంతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విశాఖలో అదనపు డీఆర్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న మనోజ్ సాహూ డీఆర్‌ఎంగా బాధ్యతలు నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే అందులో ‘అదనపు బాధ్యతలు’ అని ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. రెగ్యులర్ డీఆర్‌ఎంను నియమించేంత వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) డీఆర్‌ఎంగా విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు సూచించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది.