Jatara.. పాడేరు: మోదకొండమ్మ జాతర మోహోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jun 09 , 2024 | 07:38 AM
అల్లూరి జిల్లా: గిరి పుత్రుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం ఉదయం పాడేరులో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలు, ఘట్టాలతో సతకంపట్లు వరకు బారిగా ఊరేగించారు.
అల్లూరి జిల్లా: గిరి పుత్రుల ఆరాధ్య దేవత శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు (Sri Modakondamma Utsavalu) ఆదివారం ఉదయం పాడేరు (Paderu)లో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలు, ఘట్టాలతో సతకంపట్టు వరకు బారిగా ఊరేగించారు. అమ్మవారిని, పాదాలను ఎత్తుకొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మోదకొండమ్మను అత్తవారింటి నుంచి పుట్టింటికి తోడ్కొని వచ్చి పుట్టిల్లుగా భావించే శతకంపట్టులో ప్రతిష్ఠించారు. ఈ సంద ర్భంగా భక్తులు ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. మిగిలిన రెండు రోజులు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సుమారు 750 మంది పోలీసులతో గట్టవి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్, జేసీ, పీవో, జిల్లా ఉన్నతాధికారులు ఉత్సవాలకు హాజరయ్యారు.
ప్రతి ఏడాది అనవాయితీ ప్రకారం జూన్ నెలల్లోనే మోదకొండమ్మ అమ్మవారి పండగను నిర్వహిస్తారు. పండగకు నెల రోజులు ముందు అమ్మవారి విగ్రహం, పాదాలు, ఘటాలు కోటలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మోదకొండమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. మోదకొండమ్మ, అమ్మవారు నమ్మిన భక్తులకు కొంగు బంగారమై నిత్య పూజలు అందుకుంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్తూరు: గాంధీ విగ్రహం సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News