Share News

భక్తులతో మోదకొండమ్మ ఆలయం కిటకిట

ABN , Publish Date - Dec 22 , 2024 | 10:50 PM

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

భక్తులతో మోదకొండమ్మ ఆలయం కిటకిట
మోదకొండమ్మను దర్శించుకుంటున్న భక్తులు

అర కిలోమీటరకు క్యూ

అమ్మవారికి ఘటాలు సమర్పించుకున్న భక్తులు

పాడేరురూరల్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మొక్కులు చెల్లించుకొనేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అర కిలోమీటరు మేర బారులు తీరారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఘటాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో వంటలు చేసుకొని బంధు మిత్రులతో భోజనాలు చేశారు. భక్తులకు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ప్రతినిధులు బి.వెంకటరమణ, సీహెచ్‌.రామకృష్ణ, దన్నేటిపలాసి రాము, దన్నేటిపలాసి రంజిత్‌కుమార్‌, జి.శంకరరావు, టి.ఈశ్వరరావు, కె.సతీష్‌, కె.వెంకటరమణ, కె.చంద్రమోహన్‌కుమార్‌, కె.దేముడు, ఎల్‌.రత్నాబాయి, ఎస్‌.కొండలరావు, కె.రాధాకృష్ణం నాయుడుతదితరులు పాల్గొన్నారు. పాడేరు ఘాట్‌లోని మోదాపల్లి జంక్షన్‌ వద్ద గల అమ్మవారి పాదాల వద్దకు వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 10:50 PM