నర్సీపట్నం పెద్ద చెరువుకు మహర్దశ
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:49 AM
నర్సీపట్నంలోని పెద్ద చెరువుని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలన్నది తన చిరకాల స్వప్నమని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం అమరావతిలో పర్యాటక, ఆర్‌అండ్‌బీ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నర్సీపట్నంలో ట్యాంక్ బండ్ పనులు చేపట్టడానికి ఆర్‌అండ్‌బీ శాఖ రూ.4.1 కోట్లు, పర్యాటక శాఖ 6.4 కోట్లు.. మొత్తం రూ.10.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేసి స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి
రూ.10.5 కోట్లతో ఆర్‌అండ్‌బీ, పర్యాటక శాఖల అంచనాలు
స్పీకర్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు
పనులు త్వరగా పూర్తిచేయాలని అయ్యన్నపాత్రుడు ఆదేశం
నర్సీపట్నం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలోని పెద్ద చెరువుని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయాలన్నది తన చిరకాల స్వప్నమని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారం అమరావతిలో పర్యాటక, ఆర్‌అండ్‌బీ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నర్సీపట్నంలో ట్యాంక్ బండ్ పనులు చేపట్టడానికి ఆర్‌అండ్‌బీ శాఖ రూ.4.1 కోట్లు, పర్యాటక శాఖ 6.4 కోట్లు.. మొత్తం రూ.10.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేసి స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. డిసెంబరు 15వ తేదీలోగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ నయీమ్ ముల్ల, సీఈ శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.