ప్రశాంతంగా నీట్
ABN , Publish Date - May 06 , 2024 | 01:50 AM
వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం నగరంలో ప్రశాంతంగా ముగిసింది.
97.5 శాతం హాజరు
విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):
వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం నగరంలో ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని 13 కేంద్రాల్లో ఎనిమిది వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 7,800 మంది (97.5 శాతం) హాజరయ్యారు. పరీక్ష రాసేందుకు ఉదయం 11.30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే అభ్యర్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రం ఎండ తీవ్రతకు గురయ్యారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించేందుకు సిటీ కో-ఆర్డినేటర్ ఈశ్వరీ ప్రభాకర్ పలు కేంద్రాలు తనిఖీ చేశారు.