ఆక్రమణదారులకు నోటీసులు జారీ
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:39 PM
స్థానిక మెయిన్ రోడ్డును ఇరువైపులా ఆక్రమించిన వారికి రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. మెయిన్‌రోడ్డుకు మధ్యలోంచి 50 అడుగులలోపు ఉన్న ఆక్రమణలను వర్తకులే స్వయంగా తొలగించుకోవాలని సూచించారు.
పాడేరు మెయిన్‌రోడ్డులో ఆక్రమణల కొలతలు తీసిన రెవెన్యూ సిబ్బంది
పాడేరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక మెయిన్ రోడ్డును ఇరువైపులా ఆక్రమించిన వారికి రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. మెయిన్‌రోడ్డుకు మధ్యలోంచి 50 అడుగులలోపు ఉన్న ఆక్రమణలను వర్తకులే స్వయంగా తొలగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది టేపుతో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను కొలిచి, సంబంధిత వర్తకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ దేవేంద్రుడు, డివిజనల్ సర్వేయర్ వెంకటరావు, వీఆర్‌వోలు జె.వెంకటలక్ష్మి, ఎం.రామునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.