కిమ్స్ ఐకాన్, ఎంవీపీ కేన్సర్ ఆస్పత్రికి నోటీసులు
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:16 AM
నగర పరిధిలోని రెండు ఆస్పత్రులకు వీఎంఆర్‌డీఏ అధికారులు నోటీసులు జారీచేశారు. ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఆస్పత్రుల నిర్మాణానికి భూములు తీసుకుని నిబంధనలు ప్రకారం నిరుపేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించని ఎంవీపీలోని ఎంవీపీ కేన్సర్ ఆస్పత్రి, గురుద్వార జంక్షన్‌కు సమీపంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొ న్నారు. 1990లో ఆస్పత్రి నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐ కోటాలో భూమిని కేటాయించారు. ఈ స్థలంలో ఆస్పత్రి నిర్మించాలని, పది నుంచి 20 శాతం నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఫిర్యాదుతో వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఆదేశాలు
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోని రెండు ఆస్పత్రులకు వీఎంఆర్‌డీఏ అధికారులు నోటీసులు జారీచేశారు. ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఆస్పత్రుల నిర్మాణానికి భూములు తీసుకుని నిబంధనలు ప్రకారం నిరుపేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించని ఎంవీపీలోని ఎంవీపీ కేన్సర్ ఆస్పత్రి, గురుద్వార జంక్షన్‌కు సమీపంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొ న్నారు. 1990లో ఆస్పత్రి నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఐ కోటాలో భూమిని కేటాయించారు. ఈ స్థలంలో ఆస్పత్రి నిర్మించాలని, పది నుంచి 20 శాతం నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. రెండేళ్లలోపు నర్సింగ్‌హోం పూర్తిచేయాలని, 15 ఏళ్లలోపు యాజమాన్య హక్కులు బదలాయించకూడదన్న నిబంధనలతో భూమిని ఇచ్చారు. అయితే, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిని మూడు నెలల కిందట కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి విక్రయించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 300 పడకలతో వైద్య సేవలు అందిస్తున్నారు. నిబంధనల మేరకు 60 పడకలను కేటాయించి, నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఈ ఆస్పత్రిలో నిబంధనలు పాటించడం లేదని ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు వీఎంఆర్‌డీఏ అధికారులకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధికారులు ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసులను పంపించారు. దీనిపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 1990లో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద గతంలో ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయించారు. ఇదే రీతిలో ఎంవీపీ కేన్సర్ ఆస్పత్రి కూడా సేవలను అందించడం లేదని గుర్తించిన అధికారులు ఆ యాజమాన్యానికి నోటీసులిచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ హెచ్చరించారు.