37 మంది వార్డర్లపై క్రమశిక్షణ చర్యలు
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:08 AM
విశాఖ కేంద్ర కారాగారంలో శనివారం రాత్రి ధర్నా చేసిన ఘటనలో 37 మంది వార్డర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఉత్తరాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ ఎం.రవికిరణ్ తెలిపారు. సెంట్రల్ జైలులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా పోలీసు, జైళ్ల శాఖలో పనిచేసే ఉద్యోగులెవరూ ధర్నాలు, నిరసనలు తెలపకూడదని నిబంధనలున్నాయన్నారు. అయితే విశాఖ సెంట్రల్ జైలులో వార్డర్స్ నియమావళికి వ్యతిరేకంగా, ఇతర సిబ్బంది విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించారన్నారు. ఈ నేపథ్యంలో ధర్నా చేసిన 37 మంది వార్డర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, వారిని రాష్ట్రంలోని వివిధ జైళ్లకు అటాచ్‌మెంట్ ట్రాన్స్‌ఫర్స్ చేస్తున్నట్టు ప్రకటించారు. సిబ్బందికి ఎవైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని, ధర్నాలు, నిరసనలకు దిగకూడదన్నారు. ఏకంగా కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగడం క్షమార్హం కాదన్నారు. వార్డర్ వాసుదేవరావును సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఒక వార్డర్ సస్పెన్షన్
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే క్షమించేది లేదు
ఉత్తరాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్
ఆరిలోవ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
విశాఖ కేంద్ర కారాగారంలో శనివారం రాత్రి ధర్నా చేసిన ఘటనలో 37 మంది వార్డర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఉత్తరాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ ఎం.రవికిరణ్ తెలిపారు. సెంట్రల్ జైలులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణంగా పోలీసు, జైళ్ల శాఖలో పనిచేసే ఉద్యోగులెవరూ ధర్నాలు, నిరసనలు తెలపకూడదని నిబంధనలున్నాయన్నారు. అయితే విశాఖ సెంట్రల్ జైలులో వార్డర్స్ నియమావళికి వ్యతిరేకంగా, ఇతర సిబ్బంది విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించారన్నారు. ఈ నేపథ్యంలో ధర్నా చేసిన 37 మంది వార్డర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, వారిని రాష్ట్రంలోని వివిధ జైళ్లకు అటాచ్‌మెంట్ ట్రాన్స్‌ఫర్స్ చేస్తున్నట్టు ప్రకటించారు. సిబ్బందికి ఎవైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని, ధర్నాలు, నిరసనలకు దిగకూడదన్నారు. ఏకంగా కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగడం క్షమార్హం కాదన్నారు. వార్డర్ వాసుదేవరావును సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
సిబ్బందిలో కనిపించని క్రమశిక్షణ
కేంద్ర కారాగారం సిబ్బందిలో క్రమశిక్షణ లేకపోవడాన్ని గమనించామని డీఐజీ తెలిపారు. సిబ్బంది ఆడింది ఆటగా వ్యవహరిస్తున్నారన్నారు. తప్పుచేసినవార్డర్ వాసుదేవరావును ప్రత్యేక గదిలోకి తీసుకువెళ్లి తనిఖీ చేయడం నేరం కాదన్నారు. అనుమానం వచ్చిన వారిని ఇలా తనిఖీ చేయడం జైళ్లు, పోలీసు శాఖలో సాధారణమేనన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వార్డర్ కొంతమంది ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు ప్రత్యేక నిఘా వర్గాల ద్వారా తెలిసిందన్నారు. ఈ క్రమంలోనే అనుమానితుడిని తనిఖీ చేశారన్నారు. జైలులో ఇబ్బందికర వాతావరణం నెలకొందనే సమాచారం మేరకు ప్రభుత్వం మహేశ్‌బాబును సూపరింటెండెంట్‌గా నియమించి, సరిదిద్దే బాధ్యతను అప్పగించిందన్నారు. ఆయన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేంద్రకారాగారంలో సుమారు రెండువేల మందికి పైగా ఖైదీలున్నారని. వారిలో సుమారు 82 మంది రౌడీషీటర్లు కూడా ఉన్నారన్నారు. బ్యారక్స్‌లను ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకు అన్‌లాక్, సాయంత్రం ఆరు గంటలకు లాకప్ చేయాల్సి ఉందన్నారు. అయితే ఉదయం వార్డర్ తాళాలు తీయాల్సి ఉండగా ఆ పనిని ఖైదీలతో చేయించడం చట్టవిరుద్ధమన్నారు. దీనిని సూపరింటెండెంట్ ప్రశ్నిస్తే అది ఇక్కడ మామూలే అని సమాధానమివ్వడం క్రమశిక్షణా రాహిత్యమన్నారు. జైలులో సమస్యలను నివారించేందుకు వీలుగా సుమారు 200 మంది ఖైదీలను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్టు డీఐజీ వివరించారు.