Share News

యాంటీ నార్కోటిక్స్‌పై పోలీస్‌ అధికారుల సమావేశం

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:04 AM

గంజాయి స్మగ్లింగ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ, ఒడిశా రాష్ట్రాల పోలీస్‌ శాఖలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌) ఆధ్వర్యంలో బుధవారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఏలూరు ఐజీ, విశాఖ డీఐజీ, ఒడిశా ఐజీ, కోరాపుట్‌ డీఐజీ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కోరాపుట్‌, మల్కన్‌గిరి, గజపతి, రాయగడ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. సరిహద్దు జిల్లాల ఎస్పీల మధ్య సమాచార మార్పిడి, అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టుల ఏర్పాటు, గంజాయి పండించే ప్రదేశాల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు.

యాంటీ నార్కోటిక్స్‌పై  పోలీస్‌ అధికారుల సమావేశం

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

గంజాయి స్మగ్లింగ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ, ఒడిశా రాష్ట్రాల పోలీస్‌ శాఖలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (నార్కోటిక్‌ టాస్క్‌ఫోర్స్‌) ఆధ్వర్యంలో బుధవారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో ఏలూరు ఐజీ, విశాఖ డీఐజీ, ఒడిశా ఐజీ, కోరాపుట్‌ డీఐజీ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కోరాపుట్‌, మల్కన్‌గిరి, గజపతి, రాయగడ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. సరిహద్దు జిల్లాల ఎస్పీల మధ్య సమాచార మార్పిడి, అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టుల ఏర్పాటు, గంజాయి పండించే ప్రదేశాల గుర్తింపు తదితర అంశాలపై చర్చించారు.

Updated Date - Oct 31 , 2024 | 01:04 AM