కొనసాగుతున్న వాగుల ఉధృతి
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:24 AM
మండలంలో వాగులు ఉధృతి కొనసాగుతున్నది. అధిక వర్షాలకు మూడు రోజులుగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం నాటికి కూడా వాగుల్లో నీటి ప్రవాహం తగ్గలేదు. దీంతో ఆదివాసీలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.
చింతపల్లి, సెప్టెంబరు 11: మండలంలో వాగులు ఉధృతి కొనసాగుతున్నది. అధిక వర్షాలకు మూడు రోజులుగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుధవారం నాటికి కూడా వాగుల్లో నీటి ప్రవాహం తగ్గలేదు. దీంతో ఆదివాసీలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా చెరువూరు, తడ్డపల్లి, బలభద్రం, యర్నాపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చౌడుపల్లి చెరువు వద్ద వాగు రోడ్డు పైనుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.