ఏటికొప్పాలో ఓపెన్ బార్
ABN , Publish Date - Nov 25 , 2024 | 12:17 AM
మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వ నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. లైసెన్సుడ్ షాపుల్లో మాత్రమే మద్యం అమ్మాలని, బెల్టు దుకాణాలు వుండకూడదని, బహిరంగంగా మద్యం సేవించడానికి అనుమతించవద్దన్న నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో బండిమాంబ జాతర సందర్భంగా స్థానిక మద్యం దుకాణాల నిర్వాహకులు ఓపెన్ బార్లను నిర్వహించారు
అమ్మవారి జాతర సందర్భంగా బహిరంగంగానే మద్యం విక్రయాలు
దుకాణాల వెనుక మందుబాబుల కోసం ఏర్పాట్లు
ఎలమంచిలి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వ నిబంధనలను వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. లైసెన్సుడ్ షాపుల్లో మాత్రమే మద్యం అమ్మాలని, బెల్టు దుకాణాలు వుండకూడదని, బహిరంగంగా మద్యం సేవించడానికి అనుమతించవద్దన్న నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో బండిమాంబ జాతర సందర్భంగా స్థానిక మద్యం దుకాణాల నిర్వాహకులు ఓపెన్ బార్లను నిర్వహించారు
ఏటికొప్పాకలో రెండు మద్యం దుకాణాలు వున్నాయి. ఇక్కడ నాలుగు రోజుల నుంచి బండిమాండ ఉత్సవాలు జరుగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం వేలాది మంది హాజరయ్యారు. దీంతో మద్యం దుకాణాల నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు షాపుల వెనుక ఖాళీ స్థలాల్లో టెంట్‌లు వేశారు. దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసిన వారు ఇక్కడకు వచ్చి కూర్చుని తాపీగా తాగేందుకు కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారికు ఆనుకుని, పట్టపగలు బహిరంగంగా మద్యం సేవిస్తున్నప్పటికీ పోలీసు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదు.