Share News

ఎలమంచిలిలో ఓపెన్‌ బార్‌లు!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:29 AM

పట్టణంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పట్టపగలు రోడ్లపై బహిరంగంగా మద్యం సేవిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. నిత్యం జనంతో రద్దీగా వుండే ఆర్టీసీ బస్టాండ్‌ నాలుగు రోడ్ల కూడలిలో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు వున్నప్పుడు పరిస్థితి ఏ విధంగా వుందో.. ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటైన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదన్న నిబంధనలను బేఖాతరు చేస్తున్న వైనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో పలుమార్లు కథనాలు ప్రచురితమైనప్పటికీ పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారుల్లో చీమకుట్టినట్టయినా లేదు.

ఎలమంచిలిలో ఓపెన్‌ బార్‌లు!
ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో పట్టపగలు మద్యం సేవిస్తున్న మందుబాబులు

పట్టపగలు బహిరంగంగానే మద్యపానం

తీర్థాన్ని తలపిస్తున్న బస్టాండ్‌ జంక్షన్‌

ఇబ్బంది పడుతున్న మహిళలు, విద్యార్థినులు

చోద్యం చూస్తున్న పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు

ఎలమంచిలి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పట్టపగలు రోడ్లపై బహిరంగంగా మద్యం సేవిస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదు. నిత్యం జనంతో రద్దీగా వుండే ఆర్టీసీ బస్టాండ్‌ నాలుగు రోడ్ల కూడలిలో మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు వున్నప్పుడు పరిస్థితి ఏ విధంగా వుందో.. ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటైన తరువాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదన్న నిబంధనలను బేఖాతరు చేస్తున్న వైనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో పలుమార్లు కథనాలు ప్రచురితమైనప్పటికీ పోలీసు, ఎక్సైజ్‌ శాఖల అధికారుల్లో చీమకుట్టినట్టయినా లేదు. ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న పాన్‌షాపు వద్ద తీర్థాన్ని తలపించే రీతిలో బహిరంగంగా మద్యం సేవిస్తుస్తున్నారు. దీంతో ఆ దారిన రాకపోకలు సాగించే మహిళలు, విద్యార్థినులు, బస్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర అసహనం చెందుతున్నారు. మంగళవారం ఉదయం పలువురు మందుబాబులు బస్టాండ్‌ జంక్షన్‌కు చెంతనే ఉన్న దుకాణంలో మద్యం కొనుగోలు చేసి, పక్కనే వున్న పాన్‌ షాపు వద్ద ప్లాస్టిక్‌ గ్లాసుల్లో పోసుకుని తాగుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే పోలీసులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని, దీంతో మందుబాబులు మరింత రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఎలమంచిలిలో ఓపెన్‌ బార్లను తలపిస్తున్న బహిరంగ మద్యపానాన్ని నియంత్రించాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:29 AM