మూడు రోజుల్లో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:51 AM
నగర పరిధిలో ఎవరైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ ఇకపై మూడు రోజుల్లో పూర్తిచేస్తామని సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు.
పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కూడా ఏడు రోజుల్లోపు జారీ
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చీ
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
నగర పరిధిలో ఎవరైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ ఇకపై మూడు రోజుల్లో పూర్తిచేస్తామని సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందనే ఫిర్యాదులు వస్తుండడంతో సీపీ స్పందించారు. వెరిఫికేషన్ మూడు రోజుల్లోపు పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. అలాగే వివిధ కంపెనీలు, ప్రైవేటు సంస్థల నుంచి వచ్చే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ కూడా ఏడు రోజుల్లోపు పూర్తిచేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి జాబ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కూడా ఏడురోజుల్లోగానే అందజేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. పైన పేర్కొన్నసేవలు ఎవరికైనా నిర్ణీత వ్యవధిలో పూర్తికానట్టయితే 7995095799 నంబర్‌కు ఫోన్‌లో సంప్రతించాలని సీపీ కోరారు.