కూటమి నేతలకు పదవులు
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:58 AM
రాష్ట్ర ప్రభుత్వం రజక, గవర, కొప్పుల వెలమ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్లకు బుధవారం సభ్యులను నియమించింది. అందులో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 18మంది కూటమి నాయకులకు అవకాశం లభించింది. టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు ఈ నియామకాలపై హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
గవర, కొప్పుల వెలమ,
నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌లలో సభ్యులుగా ఉమ్మడి జిల్లాకు చెందిన
18 మందికి అవకాశం
విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం రజక, గవర, కొప్పుల వెలమ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్లకు బుధవారం సభ్యులను నియమించింది. అందులో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 18మంది కూటమి నాయకులకు అవకాశం లభించింది. టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు ఈ నియామకాలపై హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర సామాజిక వర్గం అధికం. దాంతో గవర కార్పొరేషన్‌లో ఈ ప్రాంతానికి చెందిన వారికే ప్రాధాన్యం లభించింది. గవర కార్పొరేషన్ సభ్యులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన పెంటకోట అజయ్‌బాబు (విశాఖ పశ్చిమ నియోజకవర్గం), అల్లా మంగరాజు (నర్సీపట్నం), భీమరశెట్టి శ్రీనివాసరావు (ఎలమంచిలి), బొడ్డేడ నాగ గంగాధర్ (చోడవరం), పొలమరశెట్టి శ్రీనివాసరావు (విశాఖ నార్త్), రవికుమార్ మళ్ల (విశాఖ ఈస్ట్), బొడ్డేడ శ్రీనివాస్ (అనకాపల్లి), వేగి పరమేశ్వరరావు (పెందుర్తి), జనసేన నుంచి విల్లూరి హరికృష్ణ (అనకాపల్లి), భీశెట్టి గోపీకృష్ణ (విశాఖ), బీజేపీ నుంచి విశాఖకు చెందిన బుద్ధా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు.
కొప్పల వెలమ కార్పొరేషన్ సభ్యులుగా టీడీపీ నుంచి లాలం కాశీనాయుడు (పాయకరావుపేట నియోజకవర్గం), చల్లారపు రామ్మోహన్ (విశాఖ వెస్ట్), రొంగలి మహేశ్ (మాడుగుల), జనసేన నుంచి రాజాన సూర్యచంద్ర (నర్సీపట్నం), బీజేపీ నుంచి ఈర్లె శ్రీరామమూర్తి (చోడవరం)ని నియమించారు.
నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ సభ్యులుగా టీడీపీకి చెందిన పి.అప్పలరమేశ్ (నర్సీపట్నం), కేవీఎస్ నరేశ్ (విశాఖ నార్త్)ను సభ్యులుగా నియమించారు.
,