మొక్కుబడిగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే చర్యలు
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:29 PM
రెవెన్యూ సదస్సులపై ప్రజలకు సమాచారం ఇవ్వాలని, మొక్కుబడిగా నిర్వహిస్తే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు.
అధికారులకు కలెక్టర్ హెచ్చరిక
హుకుంపేట, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సులపై ప్రజలకు సమాచారం ఇవ్వాలని, మొక్కుబడిగా నిర్వహిస్తే చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని రంగశీల పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. రంగశీల పంచాయతీలో భూముల రీసర్వే జరగలేదని తెలిసి అధికారులను నిలదీశారు. భూములు రీసర్వే చేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఎన్‌హెచ్ 516-ఈ రోడ్డులో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ కృష్ణారావు, వీఆర్వో ఎం.శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.