సమస్యలు పరిష్కరించాలంటూ పూడిమడక మత్స్యకారుల నిరసన
ABN , Publish Date - Nov 21 , 2024 | 11:50 PM
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మత్స్యకారులు పూడిమడక తీరం వద్ద నినాదాలు చేశారు.
అచ్యుతాపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మత్స్యకారులు పూడిమడక తీరం వద్ద నినాదాలు చేశారు. గురువారం మత్స్యకార దినోత్సవం సందర్భంగా పూడిమడక తీరంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ చేపల వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన మత్స్యకార భరోసాను వెంటనే పంపిణీ చేయాలని, పూడిమడక వద్ద ప్రారంభించిన హార్బర్‌ని పూర్తి చేయాలన్నారు. అలాగే పూడిమడక వద్ద ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుచేస్తున్నందున 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు రూ.20 లక్షలు ప్యాకేజీ ఇవ్వాలని, పూడిమడక యువకులకు ఉపాధి కల్పించాలని, పూడిమడకలో ఎన్‌టీపీసీ ఆసుపత్రి నిర్మించి ఉచితంగా వైద్యం అందించాలని, మత్స్యకారులందరికీ ఉచిత విధ్యుత్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు వాసుపల్లి శ్రీనివాసరావు, చోడిపల్లి అప్పారావు, ఉమ్మిడి అప్పారావు, చేపల తాతలు, ఉమ్మిడి జగన్ పాల్గొన్నారు.