‘రాంకీ’ ఫార్మా కమర్షియల్ హబ్‌ను సందర్శించిన పంజాబ్ సీఎం
ABN , Publish Date - Jan 06 , 2024 | 01:14 AM
తమ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ‘రాంకీ ఫార్మా’ ప్రతినిధులను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మన్ కోరారు.
పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి
పరవాడ , జనవరి 5:
తమ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ‘రాంకీ ఫార్మా’ ప్రతినిధులను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మన్ కోరారు. శుక్రవారం ఆయన అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో గల రాంకీ ఫార్మాసిటీ కమర్షియల్ హబ్‌ను సందర్శించారు. అనంతరం రాంకీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకే అనువైన ప్రదేశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు తరలివచ్చేలా చూడాలన్నారు. ఇందుకోసం తమ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని పంపిస్తామని, ఆయనతో అన్ని విషయాలు చర్చించాలని కోరారు. ఈ సందర్భంగా ఫార్మా సిటీ ఎండీ లాల్‌కృష్ణ...రాంకీ ద్వారా చేపడుతున్న కార్యకలాపాల గురించి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ, జడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు, రాంకీ ప్రతినిధులు రాఘవరెడ్డి, యర్రయ్య తదితరులు పాల్గొన్నారు. తొలుత పంజాబ్ సీఎంకు స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీ్‌పరాజ్ ఘన స్వాగతం పలికారు.