Share News

రియల్టర్‌ దందా

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:52 AM

మండలంలోని మడుతూరు పంచాయతీలో ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకొని రోడ్డు నిర్మించాడు. ఇందుకోసం ఏపుగా పెరిగిన తాటిచెట్లను నేలకూల్చారు. ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణం చేపట్టవద్దంటూ వీఆర్వో రోడ్డు మధ్యన కాలువ తవ్వగా.. దానిని కప్పేసి రోడ్డు పనులు కొనసాగించారు.

రియల్టర్‌ దందా
గోర్జి కప్పి వేసిన రోడ్డు

గోర్జి కప్పి రోడ్డు నిర్మాణం

ఎకరా ప్రభుత్వ భూమి ఆక్రమణ

విలువ కోటి రూపాయలు

అచ్యుతాపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మడుతూరు పంచాయతీలో ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకొని రోడ్డు నిర్మించాడు. ఇందుకోసం ఏపుగా పెరిగిన తాటిచెట్లను నేలకూల్చారు. ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణం చేపట్టవద్దంటూ వీఆర్వో రోడ్డు మధ్యన కాలువ తవ్వగా.. దానిని కప్పేసి రోడ్డు పనులు కొనసాగించారు.

మడుతూరు పంచాయతీ శివారు ఎరికిరెడ్డిపాలెం వద్ద మడుతూరు- దోసూరు ప్రధాన రహదారికి దూరంగా ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సుమారు ఇరవై ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిలోకి వెళ్లడానికి రహదారి లేదు. దీంతో కొనుగోలు చేసిన భూముల పక్క నుంచి వెళ్లే కొండ గోర్జిపై పడింది. వర్షం నీరు మేకరాశి కొండ నుంచి ఎరికిరెడ్డిపాలెం మీదుగా దిగువనున్న చెరువులోకి వెళుతుంది. వర్షాకాలంలో గోర్జిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.. సర్వే నంబరు 447లో వున్న గోర్జిలో సుమారు ఎకరా స్థలాన్ని ఆక్రమించి తాను కొనుగోలు చేసిన భూమి వరకు రోడ్డు నిర్మించేశారు. అడ్డుగా వున్న భారీగా తాటి చెట్లను నరికి వేశారు. ఈ విషయం తెలుసుకున్న వీఆర్వో సింహాచలం నాయుడు.. రోడ్డుకి అడ్డంగా కాలువ తవ్వించారు. అయితే రియల్టర్‌ తెల్లవారే సరికి కాలువను పూడ్చివేసి, మిగతా రోడ్డు కూడా వేసేశారు. ఆక్రమించిన గోర్జి భూమి విలువ సుమారు కోటి రూపాయలు చేస్తుంది. కాగా గోర్జి ఆక్రమించి రోడ్డు నిర్మించిన వైనంపై మడుతూరు సర్పంచ్‌ మోటూరు సంజీవిని వివరణ కోరగా.. పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. కబ్జాదారునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అదికారులను కోరామని తెలిపారు.

Updated Date - Nov 22 , 2024 | 12:52 AM