Share News

ఆర్కే బీచ్‌రోడ్డుకు అదనపు ఆకర్షణ

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:10 AM

నగరంలోని ఆర్‌కే బీచ్‌ రోడ్డుకు మరో అదనపు ఆకర్షణ జత కాబోతోంది. నేవీ మ్యూజియం కాంప్లెక్స్‌లో యుహెచ్‌ 3 హెచ్‌ హెలికాప్టర్‌ మ్యూజియం రానున్నది. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఆర్‌కే బీచ్‌రోడ్డులో పర్యాటకుల కోసం మ్యూజియాలు ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ మూడు మ్యూజియాలు (కురుసుర సబ్‌మెరైన్‌, టీయూ-142 యుద్ధ విమానం, సీ హ్యారియర్‌ ఫైటర్‌ మ్యూజియం) ఏర్పాటయ్యాయి. నీటిలో మాత్రమే ఉండే సబ్‌మెరైన్‌ను అతి కష్టమ్మీద తీరానికి తీసుకువచ్చి మ్యూజియంగా మార్చారు. అలాగే టీయూ-142 యుద్ధ విమానాన్ని ఒకచోట నిలిపి...కాక్‌పిట్‌, లోపలి భాగాలు చూడడానికి పైకి మెట్లు నిర్మించారు. సీ హ్యారియర్‌ ఫైటర్‌ విమానాన్ని వినూత్నంగా గాలిలో వేలాడదీశారు. వీటి నిర్మాణం, సేవలు కళ్లకు కట్టేలా చిత్ర ప్రదర్శనలుఏర్పాటుచేశారు.

ఆర్కే బీచ్‌రోడ్డుకు అదనపు ఆకర్షణ
బీచ్‌ రోడ్డుకు వచ్చిన హెలికాప్టర్‌ విడి భాగాలు

సంక్రాంతికి హెలికాప్టర్‌ మ్యూజియం

మొదలైన పనులు...ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి

యుహెచ్‌-3హెచ్‌ విడి భాగాలు తరలింపు

రూ.2.2 కోట్ల వ్యయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలోని ఆర్‌కే బీచ్‌ రోడ్డుకు మరో అదనపు ఆకర్షణ జత కాబోతోంది. నేవీ మ్యూజియం కాంప్లెక్స్‌లో యుహెచ్‌ 3 హెచ్‌ హెలికాప్టర్‌ మ్యూజియం రానున్నది. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఆర్‌కే బీచ్‌రోడ్డులో పర్యాటకుల కోసం మ్యూజియాలు ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ మూడు మ్యూజియాలు (కురుసుర సబ్‌మెరైన్‌, టీయూ-142 యుద్ధ విమానం, సీ హ్యారియర్‌ ఫైటర్‌ మ్యూజియం) ఏర్పాటయ్యాయి. నీటిలో మాత్రమే ఉండే సబ్‌మెరైన్‌ను అతి కష్టమ్మీద తీరానికి తీసుకువచ్చి మ్యూజియంగా మార్చారు. అలాగే టీయూ-142 యుద్ధ విమానాన్ని ఒకచోట నిలిపి...కాక్‌పిట్‌, లోపలి భాగాలు చూడడానికి పైకి మెట్లు నిర్మించారు. సీ హ్యారియర్‌ ఫైటర్‌ విమానాన్ని వినూత్నంగా గాలిలో వేలాడదీశారు. వీటి నిర్మాణం, సేవలు కళ్లకు కట్టేలా చిత్ర ప్రదర్శనలుఏర్పాటుచేశారు.

ఇక నేవీలో పదిహేడేళ్లు సేవలు అందించి ఈ ఏడాది జూన్‌ 28వ తేదీన ఐఎన్‌ఎస్‌ డేగాలో డీ కమిషనింగ్‌ జరిగిన ‘యుహెచ్‌-3హెచ్‌’ హెలికాప్టర్‌ను తాజాగా మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది సీ హ్యారియర్‌ మ్యూజియానికి, టీయూ 142 మ్యూజియానికి మధ్యన వస్తుంది. సుమారు 23 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. దీనికి తొలుత రూ.80 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇప్పుడు అది రెండు రెట్లు పెరిగి రూ.2.2 కోట్లకు చేరింది. ఈ నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. సంక్రాంతికి పూర్తి చేసి పర్యాటకులకు కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ హెలికాప్టర్‌ను ఐఎన్‌ఎస్‌ డేగాలోనే భాగాలుగా విడదీసి రెండు ట్రాలర్లలో బుధవారం ఆర్‌కే బీచ్‌రోడ్డుకు తీసుకువచ్చారు. వాటిని భారీ క్రేన్‌ సాయంతో కేటాయించిన స్థలంలో పెట్టారు. ముందు హెలికాప్టర్‌ భాగాలన్నీ కలిపి, రూపం తీసుకువచ్చాక, తరువాత చుట్టూ సివిల్‌ పనులు చేపట్టనున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:10 AM