Share News

ఎట్టకేలకు రహదారులకు మోక్షం

ABN , Publish Date - Nov 18 , 2024 | 11:47 PM

కూటమి ప్రభుత్వం రావడంతో రహదారులకు మోక్షం కలిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి. ప్రస్తుతం బొండాం పంచాయతీ పరిధిలో జయంతివలస నుంచి బొండాంకొత్తవలస వరకు రెండు కిలోమీటర్ల మేర రహదారి పనులను సుమారు కోటి రూపాయలతో చేపడుతున్నారు.

ఎట్టకేలకు రహదారులకు మోక్షం
జయంతివలస- బొండాంకొత్తవలస రహదారి పనులు ప్రారంభమైన దృశ్యం

గత వైసీపీ పాలనలో పనులు నిలిచిపోయిన వైనం

వాహనచోదకుల ఇబ్బందులు

కూటమి ప్రభుత్వం వచ్చాక జోరుగా పనులు

అరకులోయ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రావడంతో రహదారులకు మోక్షం కలిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి. ప్రస్తుతం బొండాం పంచాయతీ పరిధిలో జయంతివలస నుంచి బొండాంకొత్తవలస వరకు రెండు కిలోమీటర్ల మేర రహదారి పనులను సుమారు కోటి రూపాయలతో చేపడుతున్నారు. జయంతివలస నుంచి కొల్యాగుడ జంక్షన్‌ వరకు సీసీరోడ్లు వేస్తుండగా, కొల్యాగుడ జంక్షన్‌ నుంచి బొండాం కొత్తవలస వరకు తారురోడ్డు వేస్తున్నారు. జయంతివలస- బొండాం కొత్తవలస మధ్య గల పెద్దగెడ్డపై రూ.2 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టారు. మిగులు నిధులతో జయంతివలస నుంచి కొల్యాగుడ జంక్షన్‌ వరకు సీసీ రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టారు. అలాగే కొల్యాగుడ జంక్షన్‌ నుంచి బొండాం కొత్తవలస వరకు తారురోడ్డు నిర్మించనున్నారు. వారం రోజుల నుంచి జయంతివలస- కొల్యాగుడ జంక్షన్‌ వరకు సీసీ నిర్మించేందుకు రహదారి చదును చేసే పనులు, వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌లు నిర్మించేందుకు పనులు చేపడుతున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 11:47 PM