Share News

వణికిస్తున్న చలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:21 PM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండడంతో చలి తీవ్రత తగ్గలేదు. పాడేరు మండలం మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు బుధవారం నమోదయ్యాయి.

వణికిస్తున్న చలి
పాడేరు మెయిన్‌రోడ్డులో బుధవారం ఉదయం పొగమంచు

మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీలు

పాడేరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండడంతో చలి తీవ్రత తగ్గలేదు. పాడేరు మండలం మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు బుధవారం నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు ఉత్తరాది ప్రాంతం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. దీంతో మధ్యాహ్న వేళల్లో మినహా మిగతా సమయాల్లో ఎండ ప్రభావం అంతగా లేదు. పలువురు ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:21 PM