Share News

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:23 PM

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సూచించారు. మండలంలోని బేతపూడి కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి మంగళవారం ఆమె సందర్శించారు.

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
బేతపూడి కస్తూర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

దేవరాపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సూచించారు. మండలంలోని బేతపూడి కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి మంగళవారం ఆమె సందర్శించారు. పదవ తరగతి విద్యార్థినుల పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. పాఠశాలలో మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గంలోని కేజీబీవీలలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయేషా, డీఎల్‌డీవో మంజులావాణి, జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడు, ఎంపీపీ చింతలబుల్లి, జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, రైవాడ జలాశయ చైర్మన్‌ పోతల పాత్రునాయుడు, కేజీబీవీ ప్రత్యేక అధికారి సీహెచ్‌ భువన మాధురి, వైస్‌ ఎంపీపీ భవాని, సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీటీసీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

వాలాబు పంచాయతీ సందర్శన

మండలంలోని గిరిజన పంచాయతీ వాలాబు శివారు గ్రామాలను కలెక్టర్‌ సందర్శించారు. గిరిజన సంప్రదాయంలో గిరిజనులు కలెక్టర్‌ కాలు కడిగి బొట్టు పెట్టి ఆహ్వానించారు. గిరిజనుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మిగతా గ్రామాలకు లింకు రోడ్లు కావాలని గిరిజనులు కోరారు. పాఠశాలను, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. డుమా పీడీ ఆర్‌.పూర్ణిమాదేవి, తహసీల్దార్‌ లక్ష్మీదేవి, డీఈఈ సత్యంనాయుడు, మండల స్ధాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:23 PM