Share News

సజావుగా నామినేషన్ల పరిశీలన

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:50 AM

మన్యంలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం సజావుగా జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకుడు కె.వివేకానందన్‌ సమక్షంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారులు భావన వశిష్ఠ, అభిషేక్‌ నిర్వహించారు. ఆయా నామినేషన్లను దాఖలు చేసిన అభ్యర్థుల సమక్షంలోనే పరిశీలన ప్రక్రియ చేపట్టారు. అయితే తిరస్కరించిన నామినేషన్లలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు లేరు. దీంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

సజావుగా నామినేషన్ల పరిశీలన
పాడేరు అసెంబ్లీ పరిధిలో నామినేషన్లు పరిశీలిస్తున్న పరిశీలకుడు కె.వివేకానందన్‌

- అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలోనే ప్రక్రియ

- పాడేరు అసెంబ్లీలో 18 మందివి ఆమోదం, ఐదుగురివి తిరస్కరణ

- అరకులోయ అసెంబ్లీలో 22 మందివి ఆమోదం, ఆరుగురివి తిరస్కరణ

- 29 వరకు ఉపసంహరణకు గడువు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

మన్యంలో పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం సజావుగా జరిగింది. జిల్లా ఎన్నికల పరిశీలకుడు కె.వివేకానందన్‌ సమక్షంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారులు భావన వశిష్ఠ, అభిషేక్‌ నిర్వహించారు. ఆయా నామినేషన్లను దాఖలు చేసిన అభ్యర్థుల సమక్షంలోనే పరిశీలన ప్రక్రియ చేపట్టారు. అయితే తిరస్కరించిన నామినేషన్లలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు లేరు. దీంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.

పాడేరు అసెంబ్లీ బరిలో 18 మందివి ఆమోదం

పాడేరు అసెంబ్లీ స్థానానికి మొత్తం 23 మంది అభ్యర్థులు 33 సెట్‌ల నామినేషన్లను దాఖలు చేశారు. ఒక్కొక్కరు రెండు, మూడు సెట్‌లు వేసిన వాళ్లున్నారు. ఆర్వో భావన వశిష్ఠ శుక్రవారం నిర్వహించిన నామినే షన్ల పరిశీలనలో 5 మంది అభ్యర్థులకు చెందిన నామినేషన్లు తిరస్కరించగా, ప్రస్తుతం 18 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను ఆమోదించారు.

అరకులోయలో 22 మందివి ఆమోదం

అరకులోయ అసెంబ్లీ స్థానానికి మొత్తం 28 మంది అభ్యర్థులు 44 నామినేషన్ల సెట్‌లు దాఖలు చేశారు. వాటి లో 22 మందివి ఆమోదించగా, ఆరుగురివి తిరస్కరించినట్టు రిటర్నింగ్‌ అధికారి వి.అభిషేక్‌ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు, జిల్లా ఎన్నికల పరిశీలకుడు కె.వివేకానందన్‌ సమక్షంలో రిటర్నింగ్‌ అఽధికారి వి.అభిషేక్‌ దాఖలైన మొత్తం 44 నామినేషన్ల పత్రాలను పరిశీలించారు. వాటిలో ఆరుగురివి తిరస్కరించగా, సక్రమంగా వున్న 22 మందివి ఆమోదించారు. అలాగే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా వాటిని ఉపసంహరించుకోవచ్చునని ఆర్వో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వీవీఎస్‌.శర్మ, ఏఆర్వో సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:50 AM